APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 13 Apr 2024 12:29 IST

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 17వ తేదీన నిర్వహించిన పరీక్షకు సంబంధించి శుక్రవారం రాత్రి రిజల్ట్స్‌ విడుదల చేశారు. గ్రూప్ 1కి మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇటీవల ప్రిలిమినరీ కీ విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఫైనల్ కీ, ఫలితాలను ప్రకటించారు. మొత్తంగా 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించగా.. వివిధ కారణాలతో పేపర్ 1, పేపర్ 2లకు సంబంధించి మొత్తం 567 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు మెయిన్స్ పరీక్ష జరిగే అవకాశముంది. 

ఎంపిక జాబితా కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని