APPSC: గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు ఓటీపీఆర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Published : 10 Mar 2024 14:32 IST

APPSC Group 1 Halltickets | అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి జనవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మార్చి 17న గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. 18 జిల్లా కేంద్రాల్లోని పలు సెంటర్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్‌ 1; మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ ఓటీపీఆర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని