APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌- 2 అభ్యర్థులకు అలర్ట్‌

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షకు ఫిబ్రవరి 14 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 12 Feb 2024 22:17 IST

APPSC Group 2 | అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.  రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా భర్తీ చేస్తోన్న 897 గ్రూప్‌-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ పరీక్ష ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ) నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు ఫిబ్రవరి 14 నుంచి హాల్‌ టికెట్లు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకొవాలని విజ్ఞప్తి చేసింది.  రాష్ట్రంలో 897 పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 21 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని