APPSC Group 2 Preliminary Key: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ కీ విడుదల

ఏపీలో గ్రూప్‌ 2 పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదలైంది. కీ కోసం ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి..

Updated : 26 Feb 2024 18:20 IST

APPSC Group 2 Preliminary Key | అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌ -2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ (APPSC Group 2 Key) విడుదలైంది. 897 గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 4,04,037 (87.17%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్క్రీనింగ్‌ పరీక్ష ఫలితాలను ఐదు నుంచి ఎనిమిది వారాల్లో ప్రకటించే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ (APPSC) అధికారులు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ -2 మెయిన్‌ పరీక్షను జూన్‌/జులైలో నిర్వహించే అవకాశం ఉంది. APPSC Preliminary Keyపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలని సూచించింది. పోస్టు/వాట్సప్‌/ఎస్‌ఎంఎస్‌/ఫోన్‌/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది. 

గ్రూప్‌-2 ప్రిలిమినరీ కీ కోసం క్లిక్ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని