CMAT 2024: ‘సీమ్యాట్‌’కు సిద్ధమేనా? దరఖాస్తులు మొదలయ్యాయ్‌..

దేశంలోని ప్రఖ్యాత మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి.

Published : 30 Mar 2024 09:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్ (CMAT) పరీక్షకు దరఖాస్తులు మొదలయ్యాయి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 18న రాత్రి 9.50గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ (NTA) తెలిపింది. ఈ పరీక్షలో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు నిబంధన లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి
  • దరఖాస్తు ఫీజు: జనరల్‌ కేటగిరీ పురుషులకు రూ.2000; మిగతా అందరూ రూ.1000 చొప్పున  చెల్లించాలి. 
  • దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఏప్రిల్‌ 19 నుంచి 21వరకు సవరించుకోవచ్చు.
  • పరీక్ష కేంద్రాలు ఎక్కడ? హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ఎప్పటినుంచి అనే వివరాలు తర్వాత వెల్లడిస్తారు. పరీక్ష మే నెలలో జరిగే అవకాశం ఉంది.
  • ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలో ఒక్కో సెక్షన్‌ నుంచి 20 చొప్పున 5 విభాగాల్లో వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. అవి.. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌. 
  • పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి ప్రశ్నకు 4 చొప్పున మొత్తం ప్రశ్నపత్రానికి 400 మార్కులు. 
  • ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం ఈకింది బుక్‌లెట్‌లో తెలుసుకోవచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని