CSIR-UGC NET: సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల

CSIR-UGC NET: ఎన్‌టీఏ డిసెంబర్‌లో నిర్వహించిన సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 04 Feb 2024 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ డిసెంబర్‌-2023 ఫలితాలను (Joint CSIR-UGC-NET Results) ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)’ ఆదివారం విడుదల చేసింది. ఈ పరీక్ష రాసినవారు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 356 కేంద్రాల్లో Joint CSIR-UGC-NET పరీక్ష జరిగింది. దీనికి మొత్తం 2,19,146 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,75,355 మంది మాత్రమే హాజరయ్యారు. సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం ఎన్‌టీఏ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే అవకాశం లభిస్తుంది.

ఫలితాలు ఎలా చూసుకోవాలి..

  • అధికారిక వెబ్‌సైట్‌ https://csirnet.nta.ac.in./ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో ‘‘Joint CSIR-UGC NET DECEMBER-2023 Score Card Live’’ అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి
  • అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ ఎంటర్‌ చేయాలి
  • మీ CSIR-UGC NET ఫలితాలు తెరపై కనిపిస్తాయి.
  • స్కోర్‌కార్డుని డౌన్‌లోడ్‌ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపర్చుకోవాలి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని