సీయూఈటీ (పీజీ) ఫలితాలు వచ్చేశాయ్..

దేశంలోని పలు ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘సీయూఈటీ-పీజీ’(CUET-PG 2024) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 13 Apr 2024 09:23 IST

దిల్లీ: దేశంలోని పలు ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘సీయూఈటీ-పీజీ’(CUET-PG 2024) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం తుది కీ విడుదల చేసిన ఎన్‌టీఏ.. శనివారం ఉదయం ఫలితాలను ప్రకటించింది. 

మార్చి 11 నుంచి 28వ తేదీ వరకు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో CUET-PG 2024 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 157 సబ్జెక్టుల్లో జరిగిన  ఈ పరీక్షల్లో సాధించిన స్కోరు ఆధారంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు(Universities), డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు మెరిట్‌ జాబితాలను రూపొందించి కౌన్సెలింగ్‌ ద్వారా  ప్రవేశాలు కల్పించనున్నాయి.  ఈ స్కోరును మొత్తంగా 190 విశ్వవిద్యాలయాలు (38 సెంట్రల్‌ యూనివర్సిటీలు, 38 రాష్ట్ర యూనివర్సిటీలు, తొమ్మిది ప్రభుత్వ సంస్థలు, 105 ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీలు) పరిగణనలోకి తీసుకొంటాయి.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని