CUET UG: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డుల విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..!

దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ నిర్వహించే CUET UG 2023 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Updated : 19 May 2023 11:51 IST

దిల్లీ: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(CUET UG 2023)- యూజీ పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న ఈ హాల్‌టికెట్లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) శుక్రవారం విడుదల చేసింది. అయితే, ప్రస్తుతానికి 21, 22, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షకు మాత్రమే ఈ అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. హాల్‌ టికెట్లను cuet.samarth.ac.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు; అలాగే, జూన్‌ 5, 6 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

అడ్మిట్ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

దేశవ్యాప్తంగా 250 యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం 13 భాషల్లో ఈ పరీక్ష జరగనుంది. దేశంలోని పలు నగరాలు/పట్టణాలతో పాటు విదేశాల్లోని 24 నగరాల్లో ఈ ఆన్‌లైన్‌ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం దాదాపు 15లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ యూజీ తర్వాత రెండో అతిపెద్ద పరీక్ష ఇదే కావడం విశేషం.

అడ్మిట్‌ కార్డు ఇలా పొందొచ్చు..

  • తొలుత cuet.samarth.ac.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
  • Home pageలో సీయూఈటీ Login లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆ పేజీలో Download Admit card అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.
  • అక్కడ Application number, పుట్టిన తేదీ వివరాలు ఇచ్చి అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్లను పొందొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని