CBSE: ఆ సోషల్‌ మీడియా ఖాతాలన్నీ ఫేక్‌.. ఫాలో కావొద్దు: సీబీఎస్‌ఈ హెచ్చరిక

సీబీఎస్‌ఈ పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు ఉన్నాయని.. వాటిలో వచ్చే సమాచారం నమ్మొద్దని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. ఆ నకిలీ ఖాతాల జాబితాను విడుదల చేసింది.

Updated : 12 Feb 2024 17:41 IST

CBSE Public Advisory | దిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్న వేళ  CBSE బోర్డు విద్యార్థులకు కీలక హెచ్చరికలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో సీబీఎస్‌ఈ లోగో, పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే నకిలీ హ్యాండిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో తమ బోర్డు పేరుతో అనేక నకిలీ ఖాతాలు ఉన్నాయని.. వాటిని ఫాలో కావొద్దని కోరింది. '@cbseindia29' హ్యాండిల్‌ మాత్రమే తమదని, దీంట్లో వచ్చిన సమాచారం మాత్రమే అధికారికమని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా 30 నకిలీ ఖాతాల జాబితాను విడుదల చేసింది. బోర్డు పేరు, లోగో పెట్టుకొని ఈ హ్యాండిల్స్‌ నకిలీ సమాచారం వ్యాప్తి విద్యార్థులు, తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. నకిలీ ఖాతాల్లో వచ్చిన సమాచారానికి తమది బాధ్యత కాదని స్పష్టం చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని