EMRS Results: ఏకలవ్య స్కూళ్లలో 10వేల పోస్టులు.. పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌..

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Published : 23 Jan 2024 02:19 IST

EMRS Result | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాల (EMRS)ల్లో భారీగా ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు (EMRS Exam Results) విడుదలయ్యాయి. మొత్తం 10,391 బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) సోమవారం విడుదల చేసింది. పీజీటీ, టీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JSA), ల్యాబ్‌ అటెండెంట్‌, అకౌంటెంట్‌ పోస్టులకు డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభ్యర్థులు రాసిన ఈ పరీక్షలో ఎంపికైన వారి వివరాలను పీడీఎఫ్‌ల రూపంలో విడుదల చేసింది. తదుపరి అప్‌డేట్స్‌ కోసం https://emrs.tribal.gov.in/ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని