Exams: గమనించారా..? ఈ పరీక్షల తేదీలు మారాయ్‌!

సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో జరిగే కొన్ని ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ తేదీలను గుర్తించుకోండి.

Updated : 25 Mar 2024 17:59 IST

Exam Dates Change| ఇంటర్నెట్‌ డెస్క్‌:  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌తో పాటు నీట్‌ పీజీ, అఖిలభారత సర్వీసుల్లో ఎంపిక కోసం జరిగే సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను సైతం రీషెడ్యూల్‌ చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత మార్పు చోటుచేసుకున్న పరీక్షల తేదీలను ఓసారి గమనిస్తే..

  • UPSC CSE 2024 : అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ (UPSC) సివిల్స్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్‌, ఫారెస్ట్‌ సర్వీస్‌ స్క్రీనింగ్‌ పరీక్షల తేదీలు మారాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ ప్రిలిమినరీ పరీక్షలు మే 26న జరగాల్సి ఉండగా, ఎన్నికల కారణంగా జూన్‌ 15కు యూపీఎస్సీ రీషెడ్యూల్‌ చేశారు.
  • AP EAP CET 2024 : ఏపీలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ మే 13 నుంచి 19 వరకు జరగాల్సి ఉండగా.. ఈ షెడ్యూల్‌ను మే 16 నుంచి 22 వరకు మార్పు చేశారు.
  • AP PGCET 2024 : ఏపీ పీజీసెట్‌ పరీక్షలో మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 3 నుంచి 7 వరకు ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. జూన్‌ 10 నుంచి 14 వరకు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
  • TS Polycet: తెలంగాణలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ పరీక్ష షెడ్యూల్‌ ప్రకారం మే 17న జరగాల్సి ఉండగా.. దాన్ని మే 24వ తేదీకి మార్పు చేశారు. ఫిబ్రవరి 15 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌ 22 వరకు కొనసాగనుంది.
  • TS EAPCET 2024 : తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఈఏపీ సెట్‌ పరీక్ష షెడ్యూల్‌ మారింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 9 నుంచి 12 వరకు జరగాల్సి ఉండగా.. వాటిని మే 7 నుంచి 11 వరకు రీషెడ్యూల్‌ చేశారు. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు; మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు జరుగుతాయి.
  • TS ICET 2024 : తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు జరిగింది. తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ పరీక్ష జూన్‌ 4, 5 తేదీల్లో జరగాల్సి ఉండగా.. ఆ పరీక్షను జూన్‌ 5, 6 తేదీలకు మార్చారు.
  • NEET PG 2024 : వైద్య విద్య ప్రవేశ పరీక్ష (నీట్‌ పీజీ-2024) తేదీని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) జూన్‌ 23కు మార్చింది. ఎన్నికలతో సంబంధం లేకపోయినప్పటికీ గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జులై 7న జరగాల్సిన ఈ పరీక్ష తేదీని రెండు వారాల పాటు ముందుకు జరుపుతూ నిర్ణయం తీసుకుంది.
  • SHRESHTA- NETS 2024 : శ్రేష్ఠ ప్రవేశ పరీక్ష: ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు సీబీఎస్‌ఈ (CBSE) అనుబంధ ప్రఖ్యాత ప్రైవేటు రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ (SHRESHTA- NETS 2024)పరీక్ష తేదీ మారింది. తొలుత ఈ పరీక్షను మే 24న నిర్వహించాలని భావించినప్పటికీ.. పోలింగ్‌ నేపథ్యంలో మే 11కు మార్పు చేశారు.
  • ICAI CA Exams: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేసింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం సీఏ ఇంటర్‌, గ్రూప్‌ 1 పరీక్ష మే 3, 5, 9 తేదీల్లో;  గ్రూప్‌ 2 పరీక్ష మే 11, 15, 17 తేదీల్లో జరగనున్నాయి. సీఏ ఫైనల్‌, గ్రూప్‌ 1 పరీక్షను మే 2, 4, 8 తేదీల్లో, గ్రూప్‌ 2 పరీక్ష మే 10, 14, 16 తేదీల్లో నిర్వహించన్నారు. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని