ఇప్పటి నుంచే ప్రణాళిక ఎలా?

బీటెక్ (ఈసీఈ) మొదటి ఏడాది ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నాను. ఉద్యోగావకాశాల కోసం ఏ సంవత్సరం నుంచి ప్రణాళిక వేసుకోవాలి? మాది గ్రామీణ నేపథ్యం కాబట్టి తగిన సలహాలు ఇవ్వగలరు.
నసీమ, అనంతపురం
మీరు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించడం అభినందనీయం. క్రమపద్ధతిలో ముందుకు సాగితే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మంచి ఉపాధి అవకాశాలను పొందవచ్చు. దానికి స్పష్టమైన ప్రణాళిక అవసరం. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలతో పోల్చినప్పుడు మీ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ సన్నద్ధత కార్యక్రమాలు కొంత తక్కువగా ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు ప్రైవేటు యూనివర్సిటీలు/ కళాశాలల్లో చదువుకున్నవారితో పోటీ పడాల్సి ఉంటుంది కాబట్టి మీ కళాశాలలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూనే, వివిధ అంశాలపై దృష్టి పెట్టాలి.
ఇంజినీరింగ్ రంగంలో రాణించాలంటే పునాది బలంగా ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత ప్రాథమిక విషయాలపై పట్టు పెంచుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయి సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవచ్చు. కనీసం రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం అవసరం. సి, పైతాన్, జావా లాంటివి ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు కూడా అత్యంత ఉపయోగకరం. ఇంజినీరింగ్ ప్రాథమిక అంశాలతో పాటు నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టి పెట్టాలి. రెండో సంవత్సరం నుంచి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, మ్యాట్ ల్యాబ్ లాంటి టూల్స్ నేర్చుకోవడం ప్రారంభించాలి. మూడో సంవత్సరం నాటికి ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ లాంటి తాజా సాంకేతిక అంశాలపై కోర్సులు పూర్తి చేస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
ఇంజినీరింగ్ సబ్జెక్టులతో పాటు ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు కూడా తప్పనిసరి. రెండో సంవత్సరం నుంచే చిన్న ప్రాజెక్టులు చేయడం, మూడో సంవత్సరం నాటికి సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి ప్రాక్టికల్ పరిజ్ఞానంతోపాటు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అదనంగా, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, ప్రజెంటేషన్ స్కిల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇవి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం గేట్, ఈఎస్‌ఈ పరీక్షలకు రెండో సంవత్సరం నుంచే సన్నద్ధం కావాలి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కావాలంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం కోడింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌లపై అవగాహన ఉండాలి.
మెరుగైన ఉపాధి కోసం సరైన మార్గదర్శకత్వం, నెట్‌వర్కింగ్ చాలా అవసరం. సీనియర్లతో, అధ్యాపకులతో తరచుగా చర్చిస్తూండాలి. లింక్డ్‌ఇన్ లాంటి వేదికల్లో చురుకుగా ఉండడం, హ్యాకథాన్‌లు, వర్క్‌షాప్‌లలో పాల్గొనడం ద్వారా కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. బీటెక్ నాలుగేళ్ల కాలంలో ప్రతి సంవత్సరం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకుసాగితే ఉద్యోగాలు, ఉన్నత విద్య, పరిశోధనల్లో విజయవంతంగా ముందుకు సాగవచ్చు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


