AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. కృష్ణా జిల్లా టాప్‌

ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో (AP Inter Results) మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరం 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Updated : 16 Apr 2024 11:18 IST

అమరావతి: ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో (AP Inter Results) మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరం 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ప్రథమ సంవత్సర ఫలితాలు ద్వితీయ సంవత్సర ఫలితాలు
ప్రథమ సంవత్సరం (ఒకేషనల్‌) ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్‌)

మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం సాధించింది. 81 శాతంతో గుంటూరు ద్వితీయ స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్‌ జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 48 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. రెండో సంవత్సరం ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.

  • ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు 4,61,273మంది హాజరు కాగా.. 3,10,875మంది పాసయ్యారు. అలాగే, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు 3,93,757 మంది రాయగా.. వారిలో 3,06,528మంది (78%) ఉత్తీర్ణులైనట్లు అధికారులు వెల్లడించారు.
  • రీకౌంటింగ్‌, రీ-వాల్యుయేషన్‌కు ఏప్రిల్‌ 18 నుంచి 24వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతో పాటు మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌ కోసం కూడా రాయవచ్చు. ప్రాక్టికల్‌ పరీక్షలు మే 1 నుంచి 4వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు ఏప్రిల్‌ 18 నుంచి 24వరకు గడువు ఇచ్చారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని