Telangana DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. టీ-సాట్‌ ప్రత్యేక తరగతులు

తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీ-సాట్‌ వెల్లడించింది.

Published : 18 Apr 2024 15:29 IST

హైదరాబాద్‌: తెలంగాణలో డీఎస్సీ (TS DSC 2024) పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ పరీక్షలపై అవగాహన కల్పించేలా టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ప్రత్యేకంగా లైవ్‌ తరగతులు నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 18 నుంచి 9 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు నిపుణ ఛానల్‌లో వివిధ సబ్జెక్టులపై అవగాహన తరగతులు కొనసాగుతాయని టీ-శాట్‌ సీఈవో బి.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. మ్యాథమేటిక్స్‌, సైన్స్‌, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే ఈ లైవ్‌ ప్రోగ్రామ్స్‌ను మరుసటిరోజు విద్య ఛానల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి పునఃప్రసారమవుతాయని పేర్కొన్నారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసేవారు తమ సందేహాలను ఫోన్‌ కాల్‌ ద్వారా చర్చలో పాల్గొని నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం 040-23540326, 23540726 నంబర్లతో పాటు టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 825 4039ను సంప్రదించవచ్చని సూచించారు. 

రైల్వేలో 4,660 పోలీస్‌ ఉద్యోగాలు.. దరఖాస్తులు మొదలయ్యాయ్‌..

తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల సవరించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఈ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తుండగా..  వీటిలో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని