Jobs Alert: ఐదు నోటిఫికేషన్లు.. 42,000+ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో  భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.

Updated : 26 Nov 2023 21:01 IST

Government Jobs Recruitment | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్‌.. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తంగా 42 వేలకు పైగా ప్రభుత్వ కొలువుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు సమీపిస్తుండటంతో ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి. ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌ (జీడీ), ఎస్‌బీఐ, తపాలాశాఖ, ఐడీబీఐ బ్యాంకులలో పలు విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల వివరాలు, దరఖాస్తుకు చివరి తేదీలను ఓసారి పరిశీలిస్తే..


‘పది’తో భారీగా ప్రభుత్వ కొలువులు.. భారీ వేతనం!

కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో 26, 146 ఉద్యోగాలకు భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు డిసెంబర్‌ 31తో ముగుస్తుంది. పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


ఐడీబీఐలో 2,100 ఉద్యోగాలు

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI)లో 2100 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. వీటిలో 800 పోస్టులు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఓ’ పోస్టులు ఉండగా..  ఒప్పంద ప్రాతిపదికన 1,300 సేల్స్‌, ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌(ESO) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 6వరకు ఆన్‌లైన్‌ https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspxలో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..


ఎస్‌బీఐ నుంచి 2 నోటిఫికేషన్లు.. 14,153 ఉద్యోగాలు

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐలో 14వేలకు పైగా ఉద్యోగాలకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ కాగా.. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో 8,773 బ్యాంకు క్లర్కు పోస్టులు కాగా.. మరో 5,280 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ (సీబీవో) ఉద్యోగాలు ఉన్నాయి.  క్లర్కు పోస్టులకు డిసెంబర్‌ 7 వరకు; సీబీవో పోస్టులకు డిసెంబర్‌ 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఎస్‌బీఐ క్లర్కు పోస్టుల నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


భారీ వేతనం.. తపాలాశాఖలో 1899 ఉద్యోగాలు

తపాలా శాఖలో భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఇంటర్‌, డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్‌ కోటా కింద 1,899 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పలు క్రీడాంశాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన అభ్యర్థులు పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్‌, మెయిల్‌గార్డ్‌, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) ఉద్యోగాలకు డిసెంబర్‌ 9వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని