ICAI CA Foundation Result: సీఏ ఫౌండేషన్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ఐసీఏఐ సీఏ ఫౌండేషన్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 

Published : 07 Feb 2024 19:41 IST

ICAI CA Foundation Result | దిల్లీ‌:  ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ (సీఏ) ఫౌండేషన్‌(ICAI CA Foundation) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ICAI) సంస్థ ఈ ఫలితాలను బుధవారం సాయంత్రం ప్రకటించింది.  తమ అధికారిక వెబ్‌సైట్‌ icai.nic.inలో అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. వీటిని తెలుసుకొనేందుకు ఆయా అభ్యర్థులు తమ ఆరు అంకెల రోల్‌ నంబర్‌తో పాటు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సిఉంటుంది. గతేడాది డిసెంబర్‌ 31 నుంచి 2024 జనవరి 2, 4, 6 తేదీల్లో సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు జరిగాయి.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని