IIT Madras: ఐఐటీ మద్రాస్‌ ‘సమ్మర్‌ ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌.. స్టైఫండ్‌ ఎంతంటే?

ఈ వేసవిలో తమ నైపుణ్యాలను పెంచుకొనే అవకాశాల కోసం చూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.

Published : 26 Feb 2024 21:31 IST

చెన్నై: ఈ వేసవిలో తమ నైపుణ్యాలు పెంచుకొనే అవకాశాల కోసం చూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. వేసవిలో చేపట్టనున్న ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ కోసం ఔత్సాహిక విద్యార్థుల నుంచి ఐఐటీ మద్రాస్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ https://sfp.iitm.ac.in/లో మార్చి 31 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని IITM తెలిపింది. రెండు మాసాల పాటు జరిగే ఈ సమ్మర్‌ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ మే 22న ప్రారంభమై జులై 21తో ముగియనుంది. అయితే, విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6వేలు చొప్పున గరిష్ఠంగా రెండు నెలల పాటు స్టైఫండ్‌ ఇవ్వనున్నారు. ఐఐటీ విద్యార్థులు ఈ దరఖాస్తులకు అనర్హులు.

అర్హులు వీరే..

బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌) మూడో సంవత్సరం లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంఈ/ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లలో మూడు/ నాలుగో సంవత్సరం చదువుతున్నవారితో పాటు మంచి అకడమిక్‌ రికార్డు కలిగిన ఎంఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 
ఈ వేసవి ఫెలోషిప్‌లో పాల్గొనే ఇంజినీరింగ్‌ విభాగాలు ఇవే..

 • ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌
 • అప్లైడ్‌ మెకానిక్స్‌ అండ్‌ బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌
 • బయో టెక్నాలజీ
 • కెమికల్‌ ఇంజినీరింగ్‌
 • సివిల్‌ ఇంజినీరింగ్‌
 • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
 • ఇంజినీరింగ్‌ డిజైన్‌
 • ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌
 • మెకానికల్‌ ఇంజినీరింగ్‌
 • మెడికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
 • మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్
 • ఓషన్ ఇంజినీరింగ్
 • సైన్స్‌ విభాగంలో పిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌
 • హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌
 • మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని