Inter Exams: ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం .. నిమిషం నిబంధన సడలింపు

ఇంటర్‌ పరీక్షల విషయంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 01 Mar 2024 21:08 IST

హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల్లో నిమిషం నిబంధన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు. దీంతో తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిబంధనను సడలించింది. ఉదయం 9గంటల తర్వాత.. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది.

ఇంటర్‌ పరీక్షలపై సీఎస్‌ సమీక్ష...

ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్‌ శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్‌, పది పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9,80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28నుంచి మొదలైన ఇంటర్‌ పరీక్షలు.. మార్చి 19వరకు కొనసాగనున్నాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని