JEE Main 2024: జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 2) అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 2) అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. 

Published : 01 Apr 2024 15:48 IST

JEE Main Session 2 Admit cards | ఇంటర్నెట్‌ డెస్క్‌:  జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 4 నుంచి 12 వరకు ఈ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసిన ఎన్‌టీఏ (NTA).. ఈ నెల  4, 5, 6 తేదీల్లో జరిగే పేపర్‌ 1 (బీఈ/బీటెక్‌) పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 8, 9 తేదీల్లో (పేపర్‌ -1),  12వ తేదీన (పేపర్‌ 2 ఎ, బి) పరీక్షలకు త్వరలోనే అడ్మిట్‌ కార్డులను విడుదల చేయనుంది.

పేపర్‌-1 పరీక్ష రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) జరగనుంది. అలాగే, పేపర్‌-2 పరీక్ష ఒకే షిఫ్టు (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు)లో నిర్వహించనున్నారు. అడ్మిట్‌ కార్డులు పొందేందుకు అభ్యర్థులు తన అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని