JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తులు షురూ.. పరీక్ష తేదీలు, సిలబస్‌ ఇదే..!

జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యార్థులు ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

Updated : 02 Nov 2023 16:34 IST

JEE Main 2024 Applications| దిల్లీ: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో వచ్చే ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌-2024 (JEE main 2024) నోటిఫికేషన్‌  విడుదలైంది.  జనవరిలో తొలి విడత పరీక్షలు, ఏప్రిల్‌లో రెండో విడత జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. సెషన్‌ 1 పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ప్రారంభించింది. నవంబర్‌ 30న రాత్రి 9గంటల వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. JEE Main సెషన్‌-1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య తేదీల్లో జరుగుతాయి. (జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 సిలబస్‌ కోసం క్లిక్‌ చేయండి)

JEE Main పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌‌ కార్డులను పరీక్ష జరగడానికి మూడు రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సెషన్‌ -1 ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నట్టు NTA నోటిఫికేషన్‌లో పేర్కొంది. JEE Main Session 2కు ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 02 రాత్రి 9గంటల వరకు స్వీకరిస్తారు. పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య జరుగుతాయి. ఫలితాలను ఏప్రిల్‌ 25న విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్‌ పరీక్షను 13 భాషల్లో (ఆంగ్లం, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళ్‌, ఉర్దూ) నిర్వహించనున్నారు.

తొలి సెషన్ రిజిస్ట్రేషన్ల కోసం క్లిక్‌ చేయండి

ఇలా అప్లై చేసుకోండి

  • Jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వండి
  • సెషన్‌-1 రిజిస్ట్రేషన్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి
  • రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత అప్లికేషన్‌ ఫారం ఫిల్‌ చేసేందుకు లాగిన్‌ అవ్వండి.
  • అవసరమైన సమాచారాన్ని ఎంటర్‌ చేసి, డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయండి. ఫీజు చెల్లింపు పూర్తి చేయండి.
  • ఆ తర్వాత మీ ఫారమ్‌ను సబ్‌మిట్‌ చేసి కన్ఫర్మేషన్‌ పేజీని సేవ్‌ చేసిపెట్టుకోండి.

దరఖాస్తు ఫీజు వివరాలివే..

నోటిఫికేషన్‌లో మరికొన్ని ముఖ్యాంశాలు.. 

  • దేశంలోని NITs, IIITsలల్లో ఇంజినీరింగ్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో చేరాలంటే మాత్రం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడం తప్పనిసరి. మెయిన్‌ పరీక్షలో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
  • ఇంటర్‌ మార్కుల నిబంధన: గతంలో కనీస మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణులైతే చాలు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశం పొందేలా వెసులుబాటు కల్పించారు. ఈసారి మళ్లీ మార్కుల నిబంధనను విధించారు. జేఈఈ మెయిన్‌లో ఎంత ర్యాంకు వచ్చినా ఇంటర్‌లో మాత్రం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65శాతం, మిగిలిన వారికి 75 మార్కులు తప్పనిసరిగా రావాలని NTA స్పష్టంచేసింది.
  • జేఈఈ మెయిన్‌ పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఆంగ్లంతోపాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషల్లో ఇస్తారు.
  • పరీక్షలు కంప్యూటర్‌ ఆధారితంగా జరుగుతాయి.  బీఆర్క్‌ విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ విధానంలో డ్రాయింగ్‌ పరీక్ష ఉంటుంది. పేపర్‌-1 300 మార్కులకు, పేపర్‌-2 400 మార్కులకు ఉంటాయి.
  • పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. మొదటి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు; రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
  • ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-బీలో 10 ప్రశ్నల్లో అయిదుకు సమాధానాలు గుర్తించాలి. రెండు సెక్షన్లలోనూ తప్పు సమాధానాలకు మైనస్‌ మార్కులుంటాయి.
  • దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు లేదా తమ తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ చిరునామాలే ఇవ్వాలి. ఏదైనా సమాచారం ఉంటే వాటికి పంపిస్తారు.
  • ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్‌చేసి సంప్రదించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని