కరెంట్‌ అఫైర్స్‌

లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతూ ఇటీవల 21 రోజులపాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి వార్తల్లో నిలిచిన ఇంజినీర్‌, విద్యా సంస్కరణవేత్త ఎవరు?

Published : 10 May 2024 00:17 IST

మాదిరి ప్రశ్నలు

లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతూ ఇటీవల 21 రోజులపాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి వార్తల్లో నిలిచిన ఇంజినీర్‌, విద్యా సంస్కరణవేత్త ఎవరు? (భారత ఈశాన్య సరిహద్దు కొసన ఉండే లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఓ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని, తమ ప్రాంతానికి ఇద్దరు ఎంపీలు ఉండాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 2019 ఆగస్టు 5న మునుపటి జమ్మూ-కశ్మీర్‌ నుంచి విడదీసి, కేంద్రపాలిత ప్రాంతం చేశారు. 2020 నుంచి అక్కడి ప్రజలు చేస్తున్న నిరసనలకు పరాకాష్ఠగా తాజాగా ఈయన చేసిన నిరసన దీక్ష నిలిచింది.)

జ: సోనమ్‌ వాంగ్‌ఛుక్‌


భారత్‌లో ఉపాధి రహిత వృద్ధిని ఆక్షేపిస్తూ ఐఎల్‌ఓ (అంతర్జాతీయ కార్మిక సంస్థ) వెలువరించిన తాజా నివేదిక ప్రకారం 2000    సంవత్సరం నాటికి యువతలో 5.7 శాతంగా నమోదైన నిరుద్యోగిత 2022 నాటికి ఎంత  శాతానికి ఎగబాకింది? (మొత్తం నిరుద్యోగ శ్రామిక శ్రేణిలో ఎకాయెకి 83 శాతం యువతేనని నివేదిక వెల్లడించింది. తెలంగాణలోని 15-29 ఏళ్ల వయస్కుల్లో 30 శాతం యువతులు, 18 శాతం యువకులు నిరుద్యోగంలో మగ్గిపోతున్నట్లు నివేదిక వెల్లడించింది. నిపుణ బోధన సిబ్బంది కొరతను నివేదిక ప్రస్తావించింది.

జ: 12.1 శాతం


పీచు మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించిన ఏ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏడాది పాటు నిషేధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది? (ఇంతకు ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.)    

జ: హిమాచల్‌ ప్రదేశ్‌


ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు హై పవర్డ్‌ మైక్రోవేవ్‌ (హెచ్‌పీఎమ్‌) వెపన్స్‌ను రూపొందించారు?

జ:  చైనా



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని