JEE Main final key: జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) ఫైనల్‌ కీ విడుదల

జేఈఈ మెయిన్‌ (సెషన్‌ -2) ఫైనల్‌ కీ విడుదలైంది.

Updated : 22 Apr 2024 14:54 IST

JEE Main 2024 final key| దిల్లీ: జేఈఈ మెయిన్‌ 2024 (సెషన్‌-2) పరీక్షల ఫైనల్‌ ఆన్షర్‌ కీ విడుదలైంది. ఈ కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 25న JEE main ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ అంతకన్నా ముందే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాలు వెల్లడైన తర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ స్కోరు కార్డును పొందొచ్చు. 

ఏప్రిల్‌ 4 నుంచి 12 వరకు జరిగిన JEE Main సెషన్‌ -2 పరీక్షకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకొని మెరిట్‌ లిస్ట్‌ను ఎన్టీఏ (NTA) విడుదల చేయనుంది.

27 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు

జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఏప్రిల్‌ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 17 నుంచి 26 వరకు అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచుతారు. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌ -1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ -2 పరీక్షలు జరుగుతాయి. వీటి ఫలితాలను జూన్‌ 9న ప్రకటిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని