JNVST 2024 Results: ‘నవోదయ’ 6, 9 తరగతి ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

నవోదయలో ఆరు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 31 Mar 2024 15:39 IST

దిల్లీ: నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష( Navodaya Vidyalaya selection test) ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 649 పాఠశాలల్లో సీట్ల భర్తీకి గతేడాది జూన్‌ నుంచి ఆగస్టు 25వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. జనవరి 20న ఆరోతరగతి, ఫిబ్రవరి 10న తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఆయా తరగతులకు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా JNVST 2024 ఫలితాలు పొందొచ్చు.

ఆరో తరగతి ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

 తొమ్మిదో తరగతి  ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని