Kendriya Vidyalaya Admissions: కేవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ.. ఎలా అప్లై చేయాలి?

Kendriya Vidyalaya Admissions: కేవీల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి.

Updated : 01 Apr 2024 10:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya Vidyalaya) చేర్పించాలనుకొనే తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌. నామ మాత్రపు రుసుంతో చిన్నారుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించే ఈ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆసక్తి కలిగిన వారు నేటి నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. వీటిలో సీటు దొరికితే ప్లస్‌ టూ వరకు పిల్లల చదువులు నిశ్చింతగా సాగుతాయి. అయితే, దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరం? తదితర వివరాలను పరిశీలిస్తే..

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • కేవీఎస్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను సందర్శించి తొలుత రిజిస్టర్‌ అవ్వాలి (తొలిసారి విజిటర్‌ అయితే)
  • మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీతో పాటు లాగిన్‌కు అవసరమైన వివరాలను ఎంటర్‌ చేయాలి.
  • ఒకటోతరగతి అడ్మిషన్‌ అప్లికేషన్‌ను యాక్సిస్‌ చేయాలి.
  • దరఖాస్తులో అడిగిన విధంగా పిల్లల వివరాలు, తల్లిదండ్రుల సమాచారం, ఏ స్కూల్‌లో చేర్చాలనుకొంటున్నారో పేర్కొనాలి.
  • పిల్లలు, తల్లిదండ్రుల వివరాలు నింపడంతో పాటు, ఏ స్కూల్‌లో చేర్పించాలనుకొంటున్నారో ప్రాధాన్యతల వారీగా ఎంపిక చేసుకోవాలి. 
  • స్కాన్‌ చేసిన డాక్యుమెంట్‌లు, ఫొటో గ్రాఫ్‌లను (అక్కడ పేర్కొన్న సైజుల్లో) అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తును నింపడం, డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయడం పూర్తయ్యాక ఒకసారి సరిచూసుకొని సబ్మిట్‌ చేయాలి.
  • సబ్మిషన్‌ విజయవంతమైతే అప్లికేషన్‌ కోడ్‌ వస్తుంది.
  • ఎడిట్‌ ఆప్షన్‌ లేనందున దరఖాస్తు చేసేటప్పుడే పొరపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.

ఏయే డాక్యుమెంట్లు ఉండాలి?

  • ఈ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, పిల్లల బర్త్‌ సర్టిఫికేట్‌ (స్కాన్‌ చేసిన కాపీ); ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి చెందినవారైతే ప్రభుత్వ నుంచి సంబంధిత ధ్రువీకరణపత్రం
  • పిల్లల ఆధార్‌ కార్డు, ఫొటో
  • ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌కు సంబంధిచిన పత్రాలు.. తల్లిదండ్రులు/తాతయ్యల బదిలీ వివరాలు సమర్పించాలి.
  • రెసిడెంట్‌ సర్టిఫికెట్‌
  • గార్డియన్‌తో పిల్లవాడికి ఉన్న రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ఆధారాలు

కొన్ని ముఖ్యాంశాలివే..

  • కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ సిబ్బంది పిల్లలకు అధిక ప్రాధాన్యం. కొన్నిసీట్లను వివిధ కోటాలు, రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
  • ఒకటో తరగతిలో అడ్మిషన్‌కు పిల్లల వయస్సు 2024 మార్చి 31 నాటికి ఆరేళ్లు పూర్తవ్వాలి. ఎనిమిదేళ్లు మించరాదు. 
  • ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 1వ తేదీ ఉదయం 10గంటలకు మొదలై.. ఏప్రిల్‌ 15వ తేదీ సాయంత్రం 5గంటల వరకు స్వీకరిస్తారు. 
  • రెండు, ఆపైన తరగతుల్లో ఖాళీ సీట్లలో ప్రవేశానికి: ఏప్రిల్‌ 1 నుంచి 10 వరకు సంబంధిత విద్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ప్లస్‌ 1లో ప్రవేశాలు: పదో తరగతి ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత నుంచి మొదలవుతాయి. రిజర్వేషన్లు, తదితర పూర్తి వివరాలను ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.
  • కేవీల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిలో ఎంపికైనవారి తొలి ప్రొవిజినల్‌ లిస్ట్‌ను ఏప్రిల్‌ 19న విడుదల చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్‌ జాబితాను ఏప్రిల్‌ 29న, మూడో ప్రొవిజినల్‌ జాబితాను మే 8న విడుదల చేస్తారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని