Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేశారా? సెలెక్షన్‌ లిస్ట్‌ ఎప్పుడంటే?

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌ 15 నాటికి ముగియనుంది.

Updated : 07 Apr 2024 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్‌ 1, 2024 నాటికి ఆరేళ్లు పూర్తయిన పిల్లలు ఈ నెల 15న సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అయితే, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి చదివేందుకు ఎంపికైన విద్యార్థులతో మొదటి ప్రొవిజినల్‌ జాబితా ఏప్రిల్‌ 19న (శుక్రవారం విడుదల చేస్తారు. రెండో ప్రొవిజినల్‌ జాబితా (ఆర్‌టీఈ/సర్వీస్‌ ప్రియారిటీ (I & II)/ రిజర్వేషన్‌ కోటా) ఏప్రిల్‌ 29 (సోమవారం) విడుదల చేస్తారు (సీట్లు ఖాళీలను బట్టి). ఇకపోతే మూడో ప్రొవిజినల్‌ జాబితాను మే 8న (బుధవారం) విడుదల చేస్తారు.

ఇకపోతే, ఆయా పాఠశాలల్లో సీట్ల ఖాళీలను బట్టి రెండో తరగతి నుంచి ఆ పైతరగతులకు (పదకొండో తరగతి మినహా) ఆఫ్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్‌ 10 వరకు కొనసాగనుంది.  ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ను ఏప్రిల్‌ 15న విడుదల చేస్తారు. పదకొండో తరగతి మినహా మిగతా తరగతులన్నింటికీ అడ్మిషన్లకు తుది గడువు జూన్‌ 29. అలాగే, పదకొండో తరగతిలో ప్రవేశాలకు సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు వెలువడిన పది రోజుల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్‌ లిస్ట్‌ను పదో తరగతి ఫలితాలు ప్రకటించిన 20 రోజుల్లో పూర్తి చేస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని