TSPSC: గ్రూప్‌-4 అభ్యర్థులకు TSPSC కీలక అప్‌డేట్‌

గ్రూప్‌-4 పరీక్షకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్‌పై టీఎస్‌పీఎస్సీ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

Updated : 17 May 2024 22:15 IST

హైదరాబాద్:  గ్రూప్‌-4 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్‌ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసిన కమిషన్‌.. త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జనరల్‌ అభ్యర్థులను 1:3, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఎంపిక జాబితాలను త్వరలో విడుదల చేయనున్నట్లు శుక్రవారం రాత్రి వెల్లడించింది. అభ్యర్థులు EWS సర్టిఫికెట్‌లు, బీసీలైతే కమ్యూనిటీ, నాన్‌ క్రిమిలేయర్‌, పీడబ్ల్యూడీ సర్టిఫికెట్లు, స్టడీ/నివాసిత సర్టిఫికెట్లు (1 నుంచి ఏడో తరగతి వరకు)తో పాటు రిజర్వేషన్లు/వయో సడలింపు, ఇతర అర్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల ఉద్యోగాలకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఫిబ్రవరి 9న జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 7,26,837 మంది అభ్యర్థుల ర్యాంకులు పొందుపరిచిన TSPSC.. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఆ తర్వాత ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవల తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఉద్యోగాల భర్తీపై టీఎస్‌పీఎస్సీ దృష్టిసారించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని