Mega Job Mela: 100+ కంపెనీలు.. 5వేలకు పైగా ఉద్యోగాలు.. నల్గొండలో మెగా జాబ్‌మేళా

నల్గొండలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ హరిచందన వెల్లడించారు.

Updated : 20 Feb 2024 15:24 IST

Mega Job Mela in Nalgonda | నల్గొండ: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 26న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ హరిచందన వెల్లడించారు. 100కి పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ‘ఎక్స్’ (ట్విటర్‌) వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఫిబ్రవరి 26న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ మెగా జాబ్‌ మేళా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సెల్‌ (TFMC), తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (TASK) సహకారంతో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ సీవీ, అర్హతకు సంబంధించిన డాక్యుమెంట్‌లను తీసుకొని రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని