NEET UG 2024: నీట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. దరఖాస్తులు మొదలయ్యాయ్‌..

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ (యూజీ)-2024 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దరఖాస్తులు శుక్రవారం నుంచి మొదలయ్యాయ్‌..

Updated : 09 Feb 2024 20:01 IST

NEET UG 2024 Applications | దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (NEET UG 2024) పరీక్షకు నోటిఫికేషన్‌ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్‌ విధానంలో ఈ పరీక్ష  నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు https://neet.nta.nic.in/  క్లిక్‌ చేయండి.

జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జండర్‌ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.  అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా NTA ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని