NEET UG 2024: నీట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. తొలిసారి రికార్డుస్థాయిలో అప్లికేషన్లు!

నీట్‌ దరఖాస్తుల గడువును ఎన్‌టీఏ పొడిగించింది. ఇంకా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారికి మార్చి 16వరకు అవకాశం కల్పించింది.

Updated : 10 Mar 2024 19:30 IST

NEET UG 2024 Applications | దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (NEET UG 2024) పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించారు. గత నెలలో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తుల గడువు మార్చి 9వ తేదీ రాత్రి  ముగియగా.. తాజాగా మార్చి 16 వరకు గడువు పొడిగిస్తూ NTA నిర్ణయం తీసుకుంది. నీట్‌ పరీక్షను మే 5న నిర్వహించనుంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు https://neet.nta.nic.in/  క్లిక్‌ చేయండి.

మరోవైపు, నీట్‌ పరీక్షకు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి.  మార్చి 9నాటికి (శనివారం) తొలిసారి ఈ పరీక్షకు 25లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.  గతేడాదితో పోలిస్తే దరఖాస్తులు 4 లక్షల కన్నా అధికంగానే వచ్చినట్లు విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా గడువు పొడిగించడంతో దరఖాస్తు చేసుకొనేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని