తెలంగాణ టెన్త్‌ ఫలితాలు: నిర్మల్‌ ఫస్ట్‌.. వికారాబాద్‌ లాస్ట్‌

తెలంగాణ పదో తరగతి ఫలితాల (TS SSC Results)ను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.

Updated : 02 May 2024 11:57 IST

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి ఫలితాల (TS SSC Results)ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు పాసయ్యారు. 99.05 శాతంతో నిర్మల్‌ జిల్లా మొదటి స్థానంలో..65.10 శాతంతో వికారాబాద్‌ చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో 3,927 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. 8,883 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించినట్లు చెప్పారు.

జూన్‌ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

జూన్‌ 3 నుంచి 14 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెంకటేశం తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు నేటి నుంచి 15 రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నానమని.. మే 16లోపు ప్రధానోపాధ్యాయుల వద్ద ఫీజు చెల్లించవచ్చన్నారు. రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాలని వివరించారు. ఫలితాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావొద్దన్నారు. ఈ పరీక్షల ఫలితాలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదన్నారు. పరీక్షల్లో ఫెయిలైనా జీవితంలో అద్భుతాలు చేసినవారు ఎందరో ఉన్నారని చెప్పారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని