NTA: అలాంటిదేం లేదు.. ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: ఎన్‌టీఏ విజ్ఞప్తి

సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు వేసిన అభ్యర్థుల చేతి వేలికి సిరా ఉంటే ప్రవేశ పరీక్షలు జరిగే హాలులోకి అనుమతించరంటూ సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతోన్న ప్రచారాన్ని ఎన్‌టీఏ ఖండించింది.

Published : 09 Apr 2024 21:39 IST

దిల్లీ: పరీక్షలకు సంబంధించి సోషల్‌ మీడియాలో జరుగుతోన్న తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విజ్ఞప్తి చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు వేసిన అభ్యర్థుల చేతి వేలికి సిరా ఉంటే ప్రవేశ పరీక్షలు జరిగే హాలులోకి అనుమతించరంటూ సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది. ఆ ప్రచారం పూర్తి నిరాధారమని.. ఎన్‌టీఏ అలాంటి నిబంధనలు/మార్గదర్శకాలేవీ విడుదల చేయలేదని స్పష్టం చేసింది.

ఇంటర్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 3,712 పోస్టులకు దరఖాస్తులు షురూ!

యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్‌టీఏ కోరింది. ఓటింగ్‌ అనేది పరీక్షల అర్హతపై ప్రభావం చూపదని సష్టం చేసింది. అందువల్ల అభ్యర్థులు రాబోయే పరీక్షలపై దృష్టిపెట్టి సన్నద్ధం కావాలని సూచించింది. నీట్‌ (యూజీ) పరీక్షకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు 011-40759000 లేదా neet@nta.ac.in మెయిల్‌ చేయవచ్చని తెలిపింది. కచ్చితమైన సమాచారానికి ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌www.nta.ac.inను సందర్శించవచ్చని తెలిపింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని