CUET UG 2024: సీయూఈటీ-యూజీ పరీక్ష తేదీలు విడుదల.. పూర్తి షెడ్యూల్‌ ఇదిగో!

సీయూఈటీ యూజీ పరీక్ష షెడ్యూల్‌ను ఎన్‌టీఏ విడుదలైంది.

Published : 21 Apr 2024 15:24 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024 సంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ 2024) తేదీలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. మొత్తం 261 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఈ పరీక్షలకు 13.48లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 63 సబ్జెక్టులకు 380 సిటీల్లో, ఇతరదేశాల్లోని 26 సిటీల్లో ఏడు రోజుల్లో పరీక్షలను పూర్తి చేయనున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన 15 సబ్జెక్టులకు పెన్ను, పేపరు విధానాన్ని అవలంబించనుండగా.. మరో 48 సబ్జెక్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహించనున్నారు. పరీక్షలు మే 15న మొదలై 24తో ముగియనున్నాయి. గతేడాది ఈ పరీక్షలను 34 రోజుల పాటు 93 షిప్టుల్లో నిర్వహించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని