GAT-B 2024 Applications: బయో టెక్నాలజీలో పీజీ చేస్తారా? దరఖాస్తులు షురూ..

బయో టెక్నాలజీలో పీజీ చేయాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. జీఏటీ-బి, బీఈటీ-2024 ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు మొదలయ్యాయి.

Published : 09 Feb 2024 15:42 IST

GAT-B 2024 Applications | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని ప్రఖ్యాత సంస్థల్లో బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.  ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ (GAT-B), బయో టెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (BET)- 2024కు నోటిఫికేషన్‌ విడుదలైంది. జాతీయస్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్షల ద్వారా పలు విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్‌లలో బయో టెక్నాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌, డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందే అవకాశం లభిస్తుంది.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే.. 

  • జీఏటీ-బి, బీఈటీ-2024 ప్రవేశ పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు  ఫిబ్రవరి 8 నుంచి మార్చి 6 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు మార్చి 8, 9 తేదీల్లో NTA అవకాశం కల్పించింది.
  • GAT-B/BET- 2024 పరీక్షలు ఏప్రిల్‌ 20న (శనివారం) జరుగుతాయి. 
  • ఒక్కో పరీక్ష 3 గంటలు ఉంటుంది.  జీఏటీ-బి పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; బీఈటీ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. 
  • ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ఆంగ్లంలో ఉంటుంది. 
  • దరఖాస్తు రుసుం : జీఏటీ-బి, బీఈటీ-2024లలో ఒక్కో పరీక్షకు దరఖాస్తు ఫీజు ₹1,200. రెండు పరీక్షలు రాయాలనుకుంటే ₹2,400 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులైతే 50శాతం ఫీజు చెల్లిస్తే చాలు. 
  • దరఖాస్తులు చేసేటప్పుడు  ఏవైనా సందేహాలు ఉంటే  https://dbt.ntaonline.inలో చూడొచ్చు. లేదా 011-40759000 నంబర్‌కు ఫోన్‌ చేసి,  dbt@nta.ac.inకు మెయిల్‌లో సంప్రదించవచ్చు. 

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని