ఏపీ టెన్త్‌ ఫలితాలు.. రీవాల్యుయేషన్‌, సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఏపీ పదో తరగతి ఫలితాల్లో (AP SSC Results) 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.

Updated : 22 Apr 2024 14:21 IST

విజయవాడ: ఏపీ పదో తరగతి ఫలితాల్లో (AP SSC Results) 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. రిజల్ట్స్‌ విడుదల సందర్భంగా ఉత్తీర్ణత వివరాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ వివరించారు. బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించగా..  బాలురు 84.32 శాతం పాసయ్యారు. 2,803 పాఠశాలలు శతశాతం.. 17 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత నమోదైంది.

ఏపీ టెన్త్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

96.37 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. 62.47 శాతంతో కర్నూలు చివరి స్థానం దక్కించుకుంది. ఏపీ రెసిడెన్షియల్‌, బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 98.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 96.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఏపీ మోడల్‌ స్కూళ్లలో 92.88 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 94.56, ఆశ్రమ పాఠశాలల్లో 90.13 శాతం, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 88.96 శాతం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో 89.64 శాతం, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 79.38 శాతం, ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 80.01 శాతం, మున్సిపల్‌ హైస్కూళ్లలో 75.42 శాతం విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40 శాతం విద్యార్థులు పాసయ్యారు.

ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ దరఖాస్తులు

ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. 11.87 శాతం సెకండ్‌ క్లాస్‌, 5.56 శాతం మంది థర్డ్‌ క్లాస్‌లో పాసయ్యారు. మే 24 నుంచి జూన్‌ 3 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు