Postal GDS Results: పోస్టల్‌లో 40,889 జీడీఎస్‌ జాబ్స్‌.. షార్ట్‌లిస్ట్‌ అయినవారి నాలుగో జాబితా ఇదే..

జనవరిలో 40వేలకు పైగా జీడీఎస్‌ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన వారి నాలుగో జాబితాను తపాలాశాఖ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి షార్ట్‌లిస్ట్‌ అయినవారి జాబితా ఇదే..

Updated : 06 Jun 2023 19:10 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని పోస్టల్‌ సర్కిళ్లలో 40వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్‌లిస్ట్‌ అయినవారి  నాలుగో జాబితాను తపాలాశాఖ(Postal Department) విడుదల చేసింది. వీరంతా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది.  దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్ల పరిధిలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో మొత్తం 40,889 పోస్టులకు భారీ నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.  వీటిలో ఏపీ నుంచి 2,480 పోస్టులు; తెలంగాణలో 1266 చొప్పున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 

అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌తో పాటు కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక  చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈ-మెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు జూన్‌ 16 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఏపీ నుంచి షార్ట్‌లిస్ట్‌ అయినవారి నాలుగో జాబితా ఇదే..

తెలంగాణ నుంచి షార్ట్‌లిస్ట్‌ అయినవారి నాలుగో జాబితా ఇదే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని