EMRS Recruitment: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌!

ఏకలవ్య పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. పూర్తి వివరాలను ఈ కింది పీడీఎఫ్‌లో తెలుసుకోవచ్చు.

Updated : 05 Jun 2023 20:04 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో (Eklavya Model Residential Schools) భారీ సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో దేశంలో వచ్చే మూడేళ్లలో 740 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 3.5లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ఈ భారీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నట్టు మంత్రి గతంలో తెలిపారు. ఇందులో భాగంగా 38వేలకు పైగా కొలువుల జాతరకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రిన్సిపల్‌ పోస్టులు మొదలుకొని బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నిబంధనలను నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) విడుదల చేసింది. పూర్తి వివరాలనో నోటిఫికేషన్‌ పేరిట https://emrs.tribal.gov.in/ లో పొందుపరిచారు. 

ఏయే పోస్టులు ఎన్నంటే..?

ప్రిన్సిపల్‌ 740; వైస్‌ ప్రిన్సిపల్‌ 740; పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT) 8880, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT) 8840; ఆర్ట్‌ టీచర్‌ 740, మ్యూజిక్‌ టీచర్‌ 740; ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(PET) 1480; లైబ్రేరియన్‌ 740; కౌన్సెలర్‌ 740; స్టాఫ్‌ నర్సు 740; హాస్టల్‌ వార్డెన్‌ 1480; అకౌంటెంట్‌ 740; సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 740; జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 1480; క్యాటరింగ్ అసిస్టెంట్‌ 740; డ్రైవర్‌ 740, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ 740; ల్యాబ్‌ అటెండెంట్‌ 740; గార్డెనర్‌ 740; కుక్‌ 470, మెస్‌ హెల్పర్‌ 1480; చౌకీదార్‌ 1480; స్వీపర్‌ 2220 చొప్పున ఉన్నాయి.

డైరెక్టు ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టుల భర్తీకి నిబంధనలేంటి? విద్యార్హతలు, వేతనం ఎంత? వయో పరిమితి, అనుభవం,  ప్రొబేషన్‌ పీరియడ్‌, ఏ ప్రాతిపదికన రిక్రూట్‌ చేస్తారు? తదితర పూర్తి వివరాలను ఈ కింది నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని