APPLY NOW: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఇంకా 6 రోజులే గడువు!

రైల్వేలో అసిస్టెంట్‌ లోకోపైలట్‌ ఉద్యోగాల దరఖాస్తులకు తుది గడువు సమీపిస్తోంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి. 

Updated : 13 Feb 2024 16:05 IST

RRB ALP Recruitment 2024| ఇంటర్నెట్‌ డెస్క్‌:  రైల్వే శాఖలోని వివిధ జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా ఆరు రోజులు మాత్రమే (ఫిబ్రవరి 19 అర్ధరాత్రి 11.59 గంటల వరకు) గడువు ఉంది. ఆఖరి నిమిషం వరకు వేచి చూసి ఇబ్బందిపడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని రైల్వేశాఖ సూచిస్తోంది. 

23 మందికి 100% స్కోర్‌.. అదరగొట్టిన తెలుగు విద్యార్థులు వీళ్లే..

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే. అంతేకాక ఇంజినీరింగ్‌ పూర్తి చేసినవాళ్లూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వేతనం: అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ALP) ఉద్యోగానికి ఎంపికైన వారికి తొలుత రూ.19,900 నుంచి వేతనం అందుతుంది. ఇతర సౌకర్యాలు ఉంటాయి.
  • వయో పరిమితి: దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయస్సు జులై 1, 2024 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.  
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షల్లో మెరిట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితర ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్షల టైం లైన్‌ ఇదే..

  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT-1) జూన్‌-ఆగస్టుల మధ్య జరిగే అవకాశం ఉంది. 
  • రెండో దశ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT-2) సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు.  
  • ఆప్టిట్యూడ్‌ టెస్టు (CBAT) నవంబర్‌లో నిర్వహిస్తారు.
  • ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితాను నవంబర్‌/డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. మరిన్ని ఏఎల్‌పీ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని