JEE Advanced 2024: జేఈఈ మెయిన్‌ అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. ‘అడ్వాన్స్‌డ్‌’ రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌లో మార్పు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది.

Updated : 11 Apr 2024 09:32 IST

చెన్నై: జేఈఈ (మెయిన్‌) పరీక్ష రాసిన అభ్యర్థులకు ముఖ్య గమనిక. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IITs)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష (JEE Advanced Exam)కు రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. దాన్ని ఏప్రిల్‌ 27 నుంచి మే 7 సాయంత్రం 5గంటల వరకు మార్పు చేసినట్లు ఐఐటీ- మద్రాస్‌ ప్రకటించింది. పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని, మే 26న యథాతథంగా పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. కంప్యూటర్‌ ఆధారితంగా జరిగే ఈ పరీక్ష పేపర్‌ -1 ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; పేపర్‌ -2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరగనుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు మే 10 వరకు గడువు ఇచ్చారు. అడ్మిట్‌ కార్డులు మే 17 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే,  జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు మే 31 నుంచి అందుబాటులో ఉంచుతారు. ప్రాథమిక కీ జూన్‌ 2న విడుదల చేసి తుది కీ, ఫలితాలను జూన్‌ 9న ప్రకటిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని