RRB: అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగ దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యా? ఇలా చేయండి!

రైల్వేల్లో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

Updated : 22 Jan 2024 19:31 IST

RRB ALP Recruitment 2024| ఇంటర్నెట్‌ డెస్క్‌:  రైల్వే శాఖలో 5,600కు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు దీనికి దరఖాస్తులు చేసుకొంటున్నారు.  ఫిబ్రవరి 19 వరకు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆ సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తమకు ఫిర్యాదు చేయాలని ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌ ఓ ప్రకటనలో సూచించింది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కూడా ఏర్పాటుచేసింది. దరఖాస్తు సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే 9292001188 ఫోన్‌ నంబర్‌ లేదా ఈ- మెయిల్‌ rrb.help@csc.gov.in ద్వారా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. 

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

  • దేశంలోని మొత్తం 21 రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(RRB)ల వారీగా అసిస్టెంట్‌ లోకోపైలట్‌ ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కోటా కింద వున్న 5,696 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. వీటిలో సికింద్రాబాద్‌ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరిధిలో 758 పోస్టులు (ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే 199; దక్షిణ మధ్య రైల్వే 559) భర్తీ చేయనున్నారు.
  • విద్యార్హతలివే.. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే. అంతేకాకుండా ఇంజినీరింగ్‌ పూర్తి చేసినవాళ్లూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయో పరిమితి: దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు జులై 1, 2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల చొప్పున సడలింపు.
  • వేతనం: అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ALP) ఉద్యోగానికి ఎంపికైన వారికి తొలుత రూ.19,900 నుంచి వేతనం అందుతుంది. ఇతర సౌకర్యాలు ఉంటాయి.
  • ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్‌ ఆధారిత ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. మెరిట్‌ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 
  • దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళలు/ట్రాన్స్‌జెండర్‌/మైనారిటీ/ఈబీసీ అభ్యర్థులకు రూ.250 కాగా.. ఇతరులకు రూ.500. పరీక్ష ప్యాటర్న్‌, సిలబస్‌, తదితర పూర్తి వివరాలను ఈ కింది పీడీఎఫ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు