APPSC Group 2 Exam: ఆ అభ్యర్థులకు ఉపశమనం.. ఏపీపీఎస్సీ లేఖపై స్పందించిన ఎస్‌బీఐ

ఏపీ గ్రూప్‌ 2, ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్స్‌ పరీక్ష ఒకే రోజు ఉండడంతో ఆందోళనలో ఉన్న అభ్యర్థులకు ఉపశమనం లభించింది. పరీక్ష తేదీ మార్పు కోసం అభ్యర్థులకు ఎస్‌బీఐ అనుమతి ఇచ్చింది.      

Updated : 22 Feb 2024 01:13 IST

అమరావతి: ఏపీ గ్రూప్‌-2 (AP Group 2) పరీక్ష, ఎస్‌బీఐ క్లర్క్‌ (జూనియర్‌ అసోసియేట్స్‌) మెయిన్స్‌ (Sbi Junior Associates Main Exam) పరీక్షలు ఒకేరోజు వుండటంతో ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ రెండు పరీక్షలు ఒకేరోజు వుండటంతో  పరీక్ష తేదీ మార్చాలంటూ ఏపీపీఎస్సీ రాసిన లేఖపై ఎస్‌బీఐ స్పందించింది.  ఈ నెల 25న గ్రూప్2 పరీక్ష రాసే అభ్యర్థులు మార్చి 4న మెయిన్స్‌ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో గ్రూప్‌-2 పరీక్ష రాయనున్న అభ్యర్థులకు ఉపశమనం కలుగుతుందని ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు సుధీర్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే, మార్చి 4న ఎస్‌బీఐ మెయిన్స్‌ పరీక్ష రాయాలనుకొనే అభ్యర్థులు ఫిబ్రవరి 23న ఉదయం 9 గంటల లోపు https://ibpsonline.ibps.in/sbijaoct23/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని