SBI PO Final Result: ఎస్‌బీఐలో 2వేల పీవో పోస్టులు.. తుది ఫలితాలు వచ్చేశాయ్‌

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 2వేల ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ చెక్‌ చేసుకోవచ్చు.

Updated : 19 Mar 2024 17:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్‌బ్యాంకు(State Bank of India)లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు (SBI PO final Results) విడుదలయ్యాయి. మొత్తం 2వేల పీవో పోస్టులకు గతేడాది సెప్టెంబర్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారిని షార్ట్‌లిస్ట్‌ చేసి జనవరి 16 నుంచి సైకోమెట్రిక్‌ పరీక్ష నిర్వహించగా.. గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలను జనవరి 21 నుంచి దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించారు. అనంతరం తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు. బ్యాంకు పీవోలుగా ఎంపికైన వారి రోల్‌ నంబర్లతో జాబితాను విడుదల చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని