SEBI Jobs: ₹లక్షన్నర వేతనంతో సెబీలో ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ వాయిదా

సెబీలో భారీ వేతనాలతో పలు విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది. 

Published : 14 Apr 2024 15:53 IST

Jobs In SEBI| ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఫైనాన్షియల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)లో ఉద్యోగాల భర్తీకి గత నెలలో విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. వీటికి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 13నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. తాజాగా అది వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అప్లికేషన్ల స్వీకరణను వాయిదా వేస్తున్నట్లు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌  బోర్డు ఆఫ్‌ ఇండియా (SEBI) వెల్లడించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు మరో తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే..

  • మొత్తం 97 ఆఫీసర్‌ గ్రేడ్‌ ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌) ఉద్యోగాలకు గత నెలలో సెబీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జనరల్‌, లీగల్‌, ఐటీ, ఇంజినీరింగ్‌ ఎలక్ట్రికల్‌, రీసెర్చ్‌ అండ్‌ అఫీషియల్‌ లాంగ్వేజ్‌ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.  ఈ కొలువులకు https://www.sebi.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకొనే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ దివ్యాంగులకు ఉచితంగానే శిక్షణ ఇస్తారు.
  • మొత్తం 97 ఉద్యోగాలకు గాను.. జనరల్‌ విభాగంలో 62, ఐటీలో 24, లీగల్‌ విభాగంలో 5, ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌), రీసెర్చ్‌, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ కేటగిరీల్లో చెరో రెండు చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
  • అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌/పీజీ పూర్తి చేసి ఉండాలి. పోస్టుల వారీగా విద్యార్హతలను ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.
  • దరఖాస్తు రుసుం: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.1000 + జీఎస్టీ (నాన్‌ రిఫండబుల్‌)  చెల్లించాలి. అదే, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే రూ.100+ జీఎస్టీ చెల్లిస్తే చాలు. 
  • వయో పరిమితి: 2024 మార్చి 31 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ఆయా కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.  తొలి దశలో రెండు పేపర్లకు ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన వారిని రెండో దశ పరీక్ష (ఆన్‌లైన్‌)కు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు దేశంలోని పలు నగరాల్లో నిర్వహిస్తారు. 
  • ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది.
  • వేతనం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతం, ఇతర సౌకర్యాలతో కలిపి నెలకు దాదాపు రూ.1,49,500 (అకామిడేషన్‌ లేకుండా); అకామిడేషన్‌తో అయితే నెలకు రూ.₹1,11,000 చొప్పున అందుతుంది.
  • ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్‌: ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(ఎన్‌సీఎల్‌/దివ్యాంగులకు సెబీ ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ ఏర్పాటుచేస్తుంది. ఉచితంగానే ఆన్‌లైన్‌లో ఈ శిక్షణ ఇస్తారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల సమయంలోనే సంబంధిత కాలమ్‌లో ఆప్షన్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని