SHRESTA NETS 2024: ‘శ్రేష్ఠ’ ప్రవేశ పరీక్ష తేదీలో మార్పు.. కొత్త తేదీ ఇదే..

పేద ఎస్సీ విద్యార్థులు ప్రతిష్ఠాత్మక సీబీఎస్‌ఈ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘శ్రేష్ఠ’ ప్రవేశ పరీక్ష తేదీలో ఎన్‌టీఏ మార్పు చేసింది.

Published : 20 Mar 2024 17:51 IST

దిల్లీ: ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు సీబీఎస్‌ఈ (CBSE) అనుబంధ ప్రఖ్యాత ప్రైవేటు రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ (SHRESHTA- NETS 2024)పరీక్ష తేదీలో మార్పు చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను షెడ్యూల్‌ కన్నా ముందే నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్ణయించింది. కేంద్ర సామాజిక న్యాయం-సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షను తొలుత మే 24న జరపాలని నిర్ణయించగా..  ఎన్నికల నేపథ్యంలో మే 11కు మార్పు చేసినట్లు ఎన్‌టీఏ(NTA) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.  

పేద విద్యార్థులకు వరం.. ‘శ్రేష్ఠ’మైన విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

దీంతో మే 11న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పాటు శ్రేష్ఠ ప్రవేశపరీక్ష ఆయా కేంద్రాల్లో జరగనుంది. పరీక్ష జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల్లో ఫలితాలు ప్రకటిస్తారు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఆన్‌లైన్‌లో https://shreshta.ntaonline.in/దరఖాస్తులు స్వీకరించనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని