SSC: ‘పది’ పాసైతే చాలు.. 1,558 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. తెలుగులోనూ పరీక్ష!

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. పదో తరగతి అర్హతపై 1558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఎస్‌ఎస్‌సీ తెలిపింది. పూర్తి వివరాలివే..

Published : 30 Jun 2023 20:27 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో 1500లకు పైగా మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌ (MTS), హవల్దార్‌ (సీబీఐసీ & సీబీఎన్‌) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఎంపిక చేసే ఈ ఉద్యోగాలకు జూన్‌ 30 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జులై 21వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం 1,558 ఉద్యోగాలకు గానూ.. 1,198 పోస్టులు మల్టీటాస్కింగ్‌ సిబ్బంది కాగా.. 360 పోస్టులు సీబీఐసీ, సీబీఎన్‌లో హవల్దార్‌ పోస్టులు ఉన్నాయి. (ఖాళీల వివరాలివే..) staff selection commission ముందుగా ప్రకటించిన క్యాలెండర్‌ ప్రకారమైతే ఈ ఉద్యోగ ప్రకటన జూన్‌ 14న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. తాజాగా ప్రకటించింది.

నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివే..

  • అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి.
  • వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు: 01-08-2023 నాటికి పోస్టులను అనుసరించి 18-25, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సడలింపు ఉంటుంది.
  • ఎంపిక విధానం: ఎంటీఎస్‌ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. హవల్దార్ పోస్టులకైతే.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
  • ముఖ్యమైన తేదీలివే.. జులై 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుకు అవకాశం. ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: జులై 23. దరఖాస్తులో సవరణలకు జులై 26 నుంచి 28వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
  • దరఖాస్తు రుసుం: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలివే..: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు మొత్తం 13 భాషల్లో ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని