IBPS Jobs: ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టులకు అప్లై చేశారా? అయితే.. మీ CIBIL స్కోరు పెంచుకోండి!

బ్యాంకుల్లో క్లర్క్‌ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఐబీపీఎస్‌ కీలక నిబంధన విధించింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మంచి సిబిల్‌ స్కోరు కలిగి ఉండాలని తెలిపింది.

Updated : 06 Jul 2023 17:26 IST

దిల్లీ: పలు ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్‌ ఉద్యోగాలకు(IBPS Clerk notification) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన ఐబీపీఎస్‌ కీలక నిబంధన విధించింది. అభ్యర్థులు ఆరోగ్యకరమైన క్రెడిట్‌ హిస్టరీ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. ఈ ఎంపిక పరీక్షలో నెగ్గి బ్యాంకు ఉద్యోగంలో చేరే సమయం కన్నా ముందే CIBIL స్కోరు 650 లేదా అంతకన్నా ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలని సూచించింది. దేశవ్యాప్తంగా 4,545 ఖాళీలను భర్తీకి తాజాగా సవరించిన నోటిఫికేషన్‌లో ఈ అంశాన్ని పేర్కొంది. 

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగంలో చేరే సమయానికి ముందే క్రెడిట్‌ స్కోరు స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఎలాంటి రుణం లేదన్నట్టుగా ఆ బ్యాంకు నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC)ను సమర్పించాల్సి ఉంటుందని ఐబీపీఎస్‌ తెలిపింది. CIBIL స్కోర్‌ నమోదులో విఫలమైతే అలాంటి అభ్యర్థుల ఆఫర్‌ లెటర్‌ను ఉపసంహరించుకోవడం/ రద్దు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని హెచ్చరించింది. డిగ్రీ అర్హతతో ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. 

గమనిక: బ్యాంకు ఖాతా లేని అభ్యర్థులు CIBIL స్టేటస్‌ను  అందించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుకు ముందు సిబిల్‌ స్కోరు స్టేటస్‌ ఇవ్వాలన్న షరతు ఏమీలేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని