EdCET Results 2024: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

Telagnana EdCET Results| బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. 

Updated : 11 Jun 2024 19:29 IST

EdCET Results 2024| హైదరాబాద్‌: రెండేళ్ల బీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు (Telangana EdCET Results) విడుదలయ్యాయి. నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో మే 23న జరిగిన TG EdCET 2024 పరీక్ష ప్రిలిమినరీ కీని ఇటీవల విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నాగర్‌కర్నూలుకు చెందిన నవీన్‌కు మొదటి ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన అషిత రెండు, మూడో ర్యాంకులో శ్రీతేజ నిలిచారు. ఎడ్‌సెట్‌కు 29,463మంది దరఖాస్తు చేసుకోగా.. 28,549మంది (96.90%) ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని