TS Gurukul Results: తెలంగాణ ‘గురుకుల’ టీజీటీ ఫలితాలొచ్చేశాయ్‌

తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ ఉద్యోగ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి.

Updated : 25 Feb 2024 21:34 IST

Telangana Gurukul TGT Selection List | హైదరాబాద్‌: ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ ఉద్యోగ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://treirb.cgg.gov.in/homeలో ఉంచింది. గురుకులాల్లో 4,020 పోస్టులు ట్రైయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ ( టీజీటీ) పోస్టులకు గతేడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితాలను విడుదల చేసింది. ప్రొవిజినల్‌ జాబితాలో ఉన్న హాల్‌టికెట్‌ నంబర్‌ కలిగిన అభ్యర్థులకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ కింది తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించింది. సబ్జెక్టుల వారీగా ఎంపికైన వారి జాబితాలు ఇవే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని