TS Inter Results: ఇంటర్‌ మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారా? ఒక్క క్లిక్‌తో ఇలా!

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన ఇంటర్‌మీడియట్‌ బోర్డు.. విద్యార్థుల మార్కుల మెమోలను అందుబాటులో ఉంచింది. ఈ కింది ఇచ్చిన లింక్‌పై ఒక్క క్లిక్‌ చేయడం ద్వారా మెమోలు పొందొచ్చు.

Updated : 24 Apr 2024 20:52 IST

ప్రథమ సంవత్సర ఫలితాలు ద్వితీయ సంవత్సర ఫలితాలు
ప్రథమ సంవత్సరం (ఒకేషనల్‌) ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (Telangana Inter Results) విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.81 లక్షల మందికి పైగా పరీక్ష రాయగా..  ప్రథమ ఇంటర్‌లో 60.01%, ద్వితీయ ఇంటర్‌లో 64.19% చొప్పున ఉత్తీర్ణత నమోదైంది. అయితే, ఇంటర్‌ బోర్డు అధికారులు విద్యార్థుల మార్కుల షార్ట్‌ మెమోలను (Marks memo) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా మెమోను సులువుగా పొందొచ్చు. వీటిలో విద్యార్థి పేరు ఫొటోతో పాటు తల్లిదండ్రుల పేర్లు, సాధించిన గ్రేడ్‌, మార్కుల వివరాలను పొందుపరిచారు. ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేసి మీ మార్కుల మెమోలు పొందొచ్చు.

ఇంటర్‌ మార్కుల మెమోల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని