TS Staff nurse Results: ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు పరీక్ష తుది ఫలితాలు వచ్చేశాయ్‌..

తెలంగాణలో ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు ఉద్యోగ పరీక్ష తుది ఫలితాలు వెల్లడయ్యాయి.

Updated : 28 Jan 2024 20:38 IST

Staff Nurse Results | హైదరాబాద్‌:  తెలంగాణలో స్టాఫ్‌నర్సు(Staff Nurse) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు గతేడాది ఆగస్టు 2న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించగా.. దాదాపు 40వేల మంది రాసిన విషయం తెలిసిందే.  డిసెంబర్‌లో  తుది కీ విడుదల చేయగా.. అభ్యర్థుల నుంచి టీఎస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) అభ్యంతరాలను స్వీకరించింది. రాత పరీక్షలో మెరిట్‌, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అనంతరం తాజాగా  అభ్యర్థుల కటాఫ్‌ మార్కులు, ఫైనల్‌ మెరిట్‌లిస్ట్‌, ఎంపికైన వారి జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని