TS TET 2024: తెలంగాణ టెట్‌కు దరఖాస్తులు షురూ.. సిలబస్‌ ఇదే..

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

Published : 27 Mar 2024 17:39 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET 2024)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ https://tstet2024.aptonline.in/tstet/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్‌ ప్రకారం.. ఆన్‌లైన్‌ ఆధారిత  టెట్‌ పరీక్ష  మే 20 నుంచి జూన్‌ 3 మధ్య రెండు సెషన్లలో నిర్వహిస్తారు.  ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు; అలాగే, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. మే 15 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. టెట్‌ ఫలితాలు జూన్‌ 12న విడుదల చేస్తారు. 

టెట్‌ 2024 సిలబస్‌ కోసం క్లిక్‌ చేయండి

టెట్‌ ఒక పేపర్‌ రాసేందుకు రూ.1000, రెండు పేపర్లు రాసేందుకు రూ.2వేలు చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. టెట్‌ పేపర్‌-1 రాసేందుకు డీఈడీ, పేపర్‌-2 రాసేందుకు డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. సర్వీస్‌ టీచర్లు సైతం టెట్‌ రాయొచ్చు. ఈ పరీక్షకు విద్యార్హతలు, ఇతర పూర్తి వివరాలను ఈ కింది పీడీఎఫ్‌లో తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని